Header Banner

1 షేరు కొంటే ఏకంగా 5 షేర్లు ఉచితం! ఇంకో 2 రోజులే ఛాన్స్!

  Sun Feb 16, 2025 17:58        Business

స్మాల్ క్యాప్ కేటగిరి, ఇంజనీరింగ్ సెక్టార్ కంపెనీ అయిన గుజరాత్ టూల్ రూమ్ లిమిటెడ్ తమ షేర్ హోల్డర్లకు అదిరే శుభవార్త చెప్పింది. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇటీవలే సమావేశమై బోనస్ షేర్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు కంపెనీ ప్రకటించింది. 1 షేరు కొనుగోలు చేసిన వారికి ఏకంగా 5 షేర్లు బోనస్‌ రూపంలో అందుతాయని తెలిపింది. ఈ బోనస్ షేర్లు పొందేందుకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆలోపు కొన్నవారికే బోనస్ షేర్లు వస్తాయి. మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఐదేళ్లలో తమ షేర్ హోల్డర్లకు ఏకంగా 3124 శాతం లాభాన్ని ఇచ్చి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. గుజరాత్ టూల్ రూమ్ లిమిటెడ్ రూ. 20 లోపు ధర గల ఒక పెన్నీ స్టాక్. 

 

ఇది కూడా చదవండి: మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా.. 

 

కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. 5:1 రేషియోలో బోనస్ షేర్లు అందించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. అంటే రికార్డు తేదీ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ గల 1 ఈక్విటీ షేరుని తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ గల 5 ఈక్విటీ షేర్లను బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్లకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించేందుకు అవసరమైన రికార్డు తేదీని ఫిబ్రవరి 18, 2025గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. అంటే ఇంకో రెండు రోజులే ఉంది. ఆలోపు కొన్నవారికి ఉచితంగా 5 షేర్లు అందుతాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్‌లో గుజరాత్ టూల్ రూమ్ లిమిటెడ్ షేరు సుమారు 2.94 శాతం లాభంతో రూ. 12.25 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 45.95 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 10.18 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 1 శాతం నష్టపోయింది. గత నెల రోజులల్లో ఈ షేరు 16 శాతం మేర నష్టపోయింది. గత ఆరు నెలల్లో 2 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 69 శాతం నష్టాన్ని మిగల్చగా.. గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే ఏకంగా 3124 శాతం లాభాన్ని అందించింది. 5 సంవత్సరాల క్రితం ఇందులో ఒక లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ ఏకంగా రూ.30 లక్షలకుపైగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 284 కోట్లుగా ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Stocks #StockMarkets #MarketCrash